📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగాగిల్లాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం భీమా ప్రారంభం

గాగిల్లాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం భీమా ప్రారంభం

📰 Generate e-Paper Clip

గాగిల్లాపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం భీమా ప్రారంభం

మొదటి రోజే 152 మంది నమోదు

సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం

మద్దూరు నవంబర్ 26, ప్రజా వాణి,

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించామని సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం తెలిపారు.
పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ లో మొదటి రోజే 152 మంది గ్రామస్తులు నమోదు చేసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబంలో సంపాదించే ఒక్కరికి రూ. 5 లక్షల జీవిత బీమా ఉంటుంది. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే కడుతుంది. ప్రజలు ఒక్క రూపాయి కట్టనక్కర్లేదు. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే సి ఏం రేవంత్ రెడ్డి ఈ పథకం తీసుకొచ్చారు. మన సిద్దిపేట నుండే ఈ పథకం మొదలవడం మనకు గర్వకారణం అని అన్నారు.
గాగిల్లాపూర్ లో ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా మిగిలిన వారందరినీ కూడా త్వరలోనే నమోదు చేయిస్తాం” అని సర్పంచ్ హామీ ఇచ్చారు.
కావాల్సినవి: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్.18 నుండి 59 ఏళ్ల వారు అర్హులు.

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు:

అనంతరం గ్రామ పంచాయతీలో డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా పని చేస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తితోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కనక చంద్రం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏ పి ఓ మంజుల, కార్యదర్శి రజియా, ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.