📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాజ్యాంగ పరిరక్షణే ప్రతి పౌరుడి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణే ప్రతి పౌరుడి బాధ్యత

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ పరిరక్షణే ప్రతి పౌరుడి బాధ్యత

సకల జనులకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత గ్రంథం భారత రాజ్యాంగం

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య

ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26

భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పిస్తూ సకల జనులకు భారత రాజ్యాంగమే అసలైన రక్షణ కవచంగా నిలుస్తోందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య అన్నారు.

గురువారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య, ఉత్తర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య మాట్లాడుతూ.. దేశంలోని దళిత, బహుజన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛతో పాటు సమాన అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ రక్షణ కవచమని, రాజ్యాంగంలోని హక్కులు, విలువలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని, అంబేద్కర్ ఆశయ సాధనకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈర్ల స్వరూప సురేందర్, నాయకులు కవ్వంపల్లి సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస రాజేష్, రాష్ట్ర కార్యదర్శులు పాలరాజేశం, ఆకునూరి బాలంకూస్, ఉప్పులేటి నరేష్, కాంపల్లి జీవన్, కనుకుంట్ల సమ్మయ్య, కల్లేపల్లి అశోక్, బొల్లి నందయ్య, దొమ్మటి శేఖర్, పుల్లూరు మహేందర్, గద్దల శశిభూషణ్, పేరుకు రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.