కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి చిన్ని వెంకన్న.
ప్రజావాణి,ఇనుగుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి భూక్య చిన్ని వెంకన్న రైతులకు సూచించారు. ఇనుగుర్తి మండలం మీట్యా తండా పరిధిలో రాజమాత ఐకెపి కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచి చిన్ని వెంకన్న ఏపీఎం రాజేంద్ర కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థ నిర్మూలనకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ కూడా చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్, సిసి పుల్లయ్య,సిఎ బైరు శ్రీమతి,సెంటర్ ఇన్చార్జి నాయిని కోమలత, రైతులు చెడు పాక యాకయ్య,నాయిని కొమరయ్య,ఉడత సంతోష్ యాదవ్,గుండ్ల వెంకన్న, గుగులోతు రవి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

