📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

📰 Generate e-Paper Clip

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
దండేపల్లి: నవంబర్ 26 ప్రజావాణిభారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ప్రవేశికను చదివి వినిపిస్తూ అధికారులు, సిబ్బంది రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జేడీ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ నక్క అరుణ్, ఏపీవో దుర్గాదాస్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.