📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్
దండేపల్లి: నవంబర్ 26 ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకాన్ని దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దర్శనాల నాగేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు గంధం భాగ్యమ్మ, వార్డు సభ్యులు భూమారావు, శ్రీధర్, కారోబార్ ప్రభాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.