కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నాగుపాము పిల్ల కలకలం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈరోజు ఉదయం 9:45 గంటల సమయంలో నాగుపాము పిల్ల కనిపించడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. కార్యాలయ ఆవరణలో పాము అటూ ఇటూ సంచరిస్తుండటాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వెంటనే స్పందించిన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పామును పట్టుకుని కార్యాలయ ఆవరణకు దూరంగా బయటకు వదిలేశారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది, కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఇలాంటి విషపూరిత పాములు కనిపించడంతో సిబ్బంది, సందర్శకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

