📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిరుద్యోగ యువతకు శుభవార్త.. జోగిపేటలో సెట్విన్ వృత్తి విద్యా కోర్సులు

నిరుద్యోగ యువతకు శుభవార్త.. జోగిపేటలో సెట్విన్ వృత్తి విద్యా కోర్సులు

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ యువతకు శుభవార్త.. జోగిపేటలో సెట్విన్ వృత్తి విద్యా కోర్సులు!

• మూడు నెలల పాటు ఉచితంగా/శిక్షణతో కూడిన కోర్సులు.. దరఖాస్తులకు ఆహ్వానం

జోగిపేట | నవంబర్ 26 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జోగిపేటలో సెట్విన్ ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తెలిపారు. ఈ కేంద్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ శిక్షణ కేంద్రంలో మూడు నెలల వ్యవధితో ఎం.ఎస్. ఆఫీస్, ఫ్యాషన్ డిజైనింగ్ (గార్మెంట్ మేకింగ్), బ్యూటీషియన్, మగ్గం వర్క్ (జర్దోజీ) కోర్సులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎం.ఎస్. ఆఫీస్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన వారు, మిగిలిన కోర్సులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగ యువత తమలోని నైపుణ్యాలను వెలికితీసి ఉపాధి పొందడంతో పాటు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి?

జోగిపేట ఎన్టీఆర్ స్టేడియం, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పక్కన ఉన్న సెట్విన్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8074892953 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.