📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా అమీన్పూర్ సర్కిల్ వాటర్‌బోర్డు అధికారులు

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా అమీన్పూర్ సర్కిల్ వాటర్‌బోర్డు అధికారులు

📰 Generate e-Paper Clip

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా అమీన్పూర్ సర్కిల్ వాటర్‌బోర్డు అధికారులు!

పది రోజులుగా బంధంకొమ్ము చెరువు వద్ద తాగునీటి లీకేజీ

పట్టించుకోని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు

సామాన్యుల ఫోన్లు చేసినా స్పందన కరువు..

అమీన్పూర్, నవంబర్ 26 (ప్రజావాణి): ప్రజలకు తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులే నీటి వృథాను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి జోన్, సైబరాబాద్ రీజియన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్‌–47 అధికారుల పనితీరు ప్రజలకు తీవ్ర అసహనం కలిగిస్తోంది. బంధంకొమ్ము చెరువు వద్ద దాదాపు పది రోజులుగా తాగునీటి పైపుల నుంచి నీరు లీకవుతూ వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు కనీసం స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఒకవైపు ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ శాఖలోనే విలువైన తాగునీరు వృథా అవుతున్నా అరికట్టే చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్లు చేసినా స్పందించడం లేదని, సామాన్య ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నీటి కనెక్షన్ల విషయంలోనూ అధికారుల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండగా, లేదంటే ఏదో ఒక కారణంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉన్నతాధికారులు స్పందించి బంధంకొమ్ము చెరువు వద్ద తాగునీటి లీకేజీని తక్షణమే అరికట్టాలని, అమీన్పూర్ సర్కిల్‌–47 అధికారుల పనితీరుపై సమీక్షించి ప్రజలకు జవాబుదారీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.