📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామాభివృద్ధే లక్ష్యం.. చర్చి రోడ్డుకు మహర్దశ

గ్రామాభివృద్ధే లక్ష్యం.. చర్చి రోడ్డుకు మహర్దశ

📰 Generate e-Paper Clip

**గ్రామాభివృద్ధే లక్ష్యం.. చర్చి రోడ్డుకు మహర్దశ!**

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే గౌరవ కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో మంజూరైన నిధులతో చర్చి రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి గారు ప్రారంభించారు.

వేలేరు మండల కేంద్రంలోని బైరి రవి ఇంటి నుంచి చర్చి హాస్టల్ వరకు సుమారు 350 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సర్పంచ్ బిల్లా యాదగిరి గారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక నిధులను మంజూరు చేయడంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి గారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గారి సహకారంతో వేలేరు గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఏఎంసీ సభ్యులు సంపత్, జీపీ కార్యదర్శి విజయ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్, వార్డు సభ్యులు చైతన్య, సునీల్, చర్చి ఫాదర్ కిరణ్, ఆత్మ సభ్యులు చంద్ర మౌళి, పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన సంఘ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.