బండారుగూడెంలో 60 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభం
* ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య
* మంగపేట మండలంలో 25 కోట్ల అంతర్గత రోడ్ల పనులు పూర్తి
మంగపేట (ప్రజావాణి):
ములుగు జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముందుచూపుతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. మంత్రి సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న సూచనల మేరకు బుధవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బండారుగూడెంలో ట్రైబల్ ఫండ్ ద్వారా మంజూరైన ₹60 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క చొరవతో మంగపేట మండలంలో అంతర్గత రోడ్ల కోసం సుమారు ₹25 కోట్లు కేటాయించగా, ఆ పనులన్నీ పూర్తిస్థాయిలో పూర్తయ్యాయని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ కర్రీ నాగేంద్రబాబు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయ్యోరి యణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమరం బాలన్న, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు పెద్ది నరసింహరావు, మండల ప్రధాన కార్యదర్శులు చందర్లపాటి శ్రీనివాస్, గంగినేని శేషుగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కబ్బాక లక్ష్మన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బడిశా ఆదినారాయణ, గౌరవ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుర్సం రమేష్, మాజీ సర్పంచ్ సున్నం అనందం, నాయకులు వల్లి వంశీ, కొమరం నాగేశ్వరావు, కుర్సం శ్రీను, సోయం ఈశ్వర్, కంతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

