📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపస్తపూర్ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కార్

పస్తపూర్ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కార్

📰 Generate e-Paper Clip

*పస్తపూర్ మాజీ సర్పంచ్ ని పరామర్శించిన ఎంపీ సురేష్ షెట్కార్*

*పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ శుక్లవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా*

*ఇటీవలే మాజీ సర్పంచ్ కు పూర్తయిన ఓపెన్ హార్ట్ సర్జరీ*

*త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జహీరాబాద్ ఎంపీ షేట్కార్*

జహీరాబాద్, నవంబర్ 24(ప్రజావాణి):
పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జి శుక్లవర్ధన్ రెడ్డి మాతృమూర్తి, పస్తపూర్ మాజీ సర్పంచ్ ని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ పరామర్శించారు. ఆమెకి ఇటీవలే ‘ఓపెన్ హార్ట్ సర్జరీ'(Open Heart Surgery) అయినా సంగతి తెలిసిందే. విషయాన్నీ తెలుసుకున్న ఎంపీ సురేష్ షెట్కార్ నేరుగా శుక్లవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న ఆమెతో ఎంపీ కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఆ దేవుడి దయతో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు. అనారోగ్య సమయాల్లో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, శుక్లవర్ధన్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, న్యాల్కల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి, అప్పారావు అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.