📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్నాగారంలో పర్యటించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి

నాగారంలో పర్యటించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

గృహ ప్రవేశానికి హాజరు, ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25:జిల్లా లోని లింగాల గణపురం మండలం, నాగారం గ్రామంలో బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ముందుగా గొల్లపల్లి ఎల్లగౌడ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన గృహంలోకి ప్రవేశించిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, కొత్త ఇంట్లో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గృహ ప్రవేశ వేడుకలో గ్రామస్తులతో కలిసి కొంతసేపు గడిపారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బొట్ల కరుణాకర్ ను పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కరుణాకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో తన వంతుగా రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నర్సింగ రామకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్, మాజీ సర్పంచ్ బొట్ల భాస్కర్, భూషిగంపల ఆంజనేయులు, గ్రామశాఖ అధ్యక్షులు దండు ఉపేందర్, యూత్ అధ్యక్షులు దండు జయచందర్, రమేష్ గౌడ్, యువజన నాయకులు ఎర్ర క్రాంతి, 8వ వార్డ్ మెంబర్ బొట్ల నరేష్, బొట్ల లవకుమార్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.