📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియామకం

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియామకం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ నియామకం….!!

👉నియామక పత్రం అందజేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,

👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్..

భద్రాద్రి కొత్తగూడెం:

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ చేతుల మీదుగా చల్లా వెంకటనారాయణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ముఖ్యంగా దళిత, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీ విధానాలను, సిద్ధాంతాలను మీడియా వేదికగా, ప్రజా వేదికలపై సమర్థవంతంగా వినిపిస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చల్లా వెంకటనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్‌కు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వహిస్తానని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎస్సీ సెల్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఎస్సీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

చల్లా వెంకటనారాయణ నియామకం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.