యువ స్పోర్ట్స్ అకాడమీకి వెల్లువెత్తిన ప్రశంసలు
* జాతీయ స్థాయిలో పథకాల ప్రభంజనం
* 6 మంది విద్యార్థులు
* 6 పతకాలు
* సిద్దిపేటకు గర్వకారణం
* యువ స్పోర్ట్స్ అకాడమిక్ వ్యవస్థాపకులు
* కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్
సిద్దిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి)
మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో సిద్ధిపేట పట్టణంలోని యువ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థుల పథకాల ప్రభంజనానికి పట్టణంలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా అకాడమిక్ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మంగళవారం రోజున జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 22 న హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలు నిర్వహించబడ్డాయని అన్నారు .
సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో అకాడమిక్ చెందిన ఆరుగురు విద్యార్థులకు రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించడం విశేషమన్నారు.
గోల్డ్ మెడల్స్ లో అనన్య,సుప్రతిక్ సిల్వర్ మెడల్ శ్రీతన్, బ్రాంజ్ మెడల్స్ శ్రేష్ఠ,అవనేశ్,బాలయోగేందర్
పథకాలు అందుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
తల్లి దండ్రుల సహకారంతో విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. విద్యార్థుల పట్టుదల, ఇవన్నీ కలిస్తేనే ఈ అద్భుత విజయం అని
ఆరుగురు విద్యార్థులు బరిలోకి దిగితే ఆరుగురూ పతకాలతో తిరిగివచ్చారని అన్నారు.
విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

