మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొట్లపల్లి శివకృష్ణ
బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజకీయ గుర్తింపు కల్పించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ మానకొండూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొట్లపల్లి శివకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం బెజ్జంకిలో ఆయన మాట్లాడుతూ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను హుజూర్నగర్ నుంచి పోటీకి నిలిపి కేసీఆర్ రాజకీయంగా ప్రోత్సహించారని తెలిపారు.
2018 డిసెంబర్ ఎన్నికల సమయంలోనూ శంకరమ్మకు రాజకీయ గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ అమరవీరులకు,ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైనపేదలకు ఇళ్ల స్థలాలు కల్పించి ఇతర హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

