📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణయాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలి

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

యాసంగిలో వరి, మొక్కజొన్న సాగుకు దూరంగా ఉండాలి!
తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలి
రైతులకు సూచించిన ఏడీఏ రాజేష్
కూసుమంచి నవంబర్ 21 (మన ప్రజావాణి) ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రానున్న యాసంగి సీజన్‌లో భూగర్భ జలమట్టం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే పంటల సాగుపై దృష్టి సారించాలని కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) రాజేష్ సూచించారు. ఆదివారం కూసుమంచి మండలంలోని పాలేరు, జీళ్లచెరువు గ్రామాల్లో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా పెసర, మినుము, వేరుశనగ, జొన్న వంటి తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి మాట్లాడుతూ రైతులు పంట అవశేషాలను పొలాల్లో తగలబెట్టరాదని, వాటిని కాల్చడం వల్ల పర్యావరణానికి, భూసారానికి కలిగే నష్టాలను వివరించారు.
నీటిపారుదల శాఖ ఏఈ నవీన్ మాట్లాడుతూ యాసంగిలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ తావుర్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని, రైతులు విద్యుత్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జీళ్లచెరువు గ్రామంలో పశువైద్యాధికారి ఉష మాట్లాడుతూ పశుగ్రాసం సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరానికి రూ.14 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఏఈఓలు రఘు, రవీందర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.