📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*వార్డు నంబర్ 7లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ*

*ప్రజలకు మరింత సులభతరం కానున్న రేషన్ సేవలు*

జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): పట్టణంలోని 7 వ వార్డులో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిపిఓ లక్ష్మీ నారాయణ, వార్డు కౌన్సిలర్ వకీల్ చౌహాన్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ వకీల్ చౌహాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు. స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, సులభతరంగా అందుబాటులోకి వస్తాయని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని, వార్డు అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ మొహమ్మద్ షకీల్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్, రేషన్ డీలర్ షేక్ సమద్ సీనియర్ నాయకులు సంగన్న, మల్రెడ్డి, మ్యాతరీ గోపాల్ అజీమ్ పటేల్, యేసు రాజు, కృష్ణ, యువ నాయకులు జాకీర్, నిసార్ పటేల్, రావుఫ్ పటేల్, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.