ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి పల్నాడు, పల్నాడు జిల్లా
నరసరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నరసరావుపేట అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని పేర్కొన్నారు.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తాతో పాటు 48 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. పట్టణంలో చేపడుతున్న విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, బైపాస్ వంటి అభివృద్ధి పనులను వివరించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు , మాజీ మున్సిపల్ ఛైర్మన్ సుబ్బరాయ గుప్తా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

