📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

📰 Generate e-Paper Clip

*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా*

*అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి : మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి**

**నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నల్లగొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని 32 వ డివిజన్ కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అవగాహన కార్యక్రమంలో మేయర్ పాల్గొని మాట్లాడారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి భరోసా కల్పించడంలో ఈ పథకం కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకం వివరాలను తెలుసుకొని, నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రయోజనాలను పొందాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా నల్లగొండ నగరంలో రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత డివిజన్ కార్పొరేటర్‌తో పాటు ఇతర కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, 32వ డివిజన్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.