📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా.. రూ.3.03 లక్షల చెక్కుల పంపిణీ

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా.. రూ.3.03 లక్షల చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా.. రూ.3.03 లక్షల చెక్కుల పంపిణీ

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నర్సింహులపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.3 లక్షల 3 వేల విలువైన చెక్కులను అందజేశారు.
గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థికంగా ఎంతో తోడ్పాటునందిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జినుకల రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచినీళ్ల రఘురెడ్డి, డోర్నకల్ ప్రధాన కార్యదర్శి రేఖ అనిల్ యాదవ్, మండల యూత్ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు అల్వాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.