📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonమేఘన పెళ్లికూతురు వేడుకకు హాజరై ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

మేఘన పెళ్లికూతురు వేడుకకు హాజరై ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొలనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులు కుమార్తె మేఘన పెళ్లికూతురు వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య శుక్రవారం జరిగింది.

ఈ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై మేఘనను ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తు జీవితం సుఖసంతోషాలతో నిండాలని, కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.