మేఘన పెళ్లికూతురు వేడుకకు హాజరై ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొలనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులు కుమార్తె మేఘన పెళ్లికూతురు వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై మేఘనను ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తు జీవితం సుఖసంతోషాలతో నిండాలని, కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని ఆకాంక్షించారు....