జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం
తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్‌లో చెర్లపాలెం గ్రామానికి చెందిన సముద్రాల వెంకన్న – దుర్గమ్మ దంపతుల కుమారుడు మహేష్ శ్రీయ వివాహ మహోత్సవం, అలాగే కల్యాణ లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో చెర్లపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ లక్ష్మి నర్సయ్య దంపతుల కుమారుడు సురేష్ రాణి వివాహలు శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ రెండు వివాహ వేడుకలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఝాన్సీ రాజేందర్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల, పట్టణ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, చెర్లపాలెం గ్రామ సర్పంచ్, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

