📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదరఖాస్తుల స్వీకరణ శిబిరాలను స్పెషలాఫీసర్ సందర్శన

దరఖాస్తుల స్వీకరణ శిబిరాలను స్పెషలాఫీసర్ సందర్శన

📰 Generate e-Paper Clip

దరఖాస్తుల స్వీకరణ శిబిరాలను స్పెషలాఫీసర్ సందర్శన
ప్రజావాణి,ఇనుగుర్తి:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, ఇనుగుర్తి,కోమటిపల్లి గ్రామాలలో ప్రారంభమైంది. సంబంధిత స్పెషల్ క్యాంపులను మండల స్పెషలాఫీసర్,డిఆర్డిఏ అడిషనల్ పీడీ మల్లేశ్వరి సందర్శించి విసిట్ చేశారు.దరఖాస్తుల నమోదును పరిశీలించారు.

*బీమా కుటుంబాలకు ధీమా: మల్లేశ్వరి*

ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఆయా కుటుంబాలకు ధీమాగా ఉంటుందని స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి అన్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన,59 సంవత్సరాలు లోపు వారు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అర్హులందరినీ సంబంధిత పథకంలో చేరి సద్వినియోగపరచుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.అనంతరం ఎంపీడీవో తోట హరీష్ దరఖాస్తుల స్వీకరణ క్యాంపులను సందర్శించారు.ఆయా గ్రామాలలో సర్పంచులు చెడుపాక సుజాత యాకయ్య, తమ్మడపల్లి కుమార్, మద్దెల బిక్షపతి గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పిట్టల శేఖర్, రమణమూర్తి,ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సత్యనారాయణ,జి పి ఓ లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.