.*రౌడీ షట్టర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై సాయి కృష్ణ*
నసురుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజ
పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సాయికృష్ణ సూచన
నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లతో ఎస్ఐ సాయికృష్ణ సమావేశమై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, శాంతియుతంగా జీవించాలని, ఎలాంటి నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా మంచి పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడటం, గొడవలు, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బాధ్యతలను గుర్తించి, సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించాలని తెలిపారు.
రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా, పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ సాయికృష్ణ కోరారు.

