📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు: సునీహ విజయమే ధ్యేయంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి విస్తృత పర్యటన

పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు: సునీహ విజయమే ధ్యేయంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి విస్తృత పర్యటన

📰 Generate e-Paper Clip

ప్రజల ఆశీర్వాదమే మహాబలం.అభివృద్ధి పథమే మా ఏకైక లక్ష్యం!”

బద్వేల్ నియోజకవర్గం (పోరుమామిళ్ల):నవంబర్ 20 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసింది.వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ,పార్టీ అభ్యర్థుల విజయానికి గట్టి పునాదులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ కేంద్రమైన పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ప్రచార రంగంలోకి దూకారు.నియోజకవర్గంలో ఆయన నేతృత్వంలో సాగుతున్న ప్రచార జోరు ఓటర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

చిదానంద నగర్, రంపడు రోడ్డులో పాదయాత్ర – ప్రజా స్పందన అమోఘం:

వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి స్థానిక ముఖ్య నాయకులతో కలిసి పోరుమామిళ్లలోని చిదానంద నగర్,రంపడు రోడ్డు పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఇంటింటికీ వెళ్తూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ సాగిన ఈ పాదయాత్రకు స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.మహిళలు, వృద్ధులు,యువకులు నల్లేరు విశ్వనాథ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు.ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమైన ఆయన,వారి సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టండి:

ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ.. పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వతోముఖాభివృద్ధి జరగాలన్నా, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నా వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలో నిలిచిన శ్రీమతి షేక్ సునీహ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రజా సమస్యలపై స్పందిస్తూ,నిరంతరం అందుబాటులో ఉండే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.అభివృద్ధి పనుల నిరంతర కొనసాగింపునకు,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడటానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి వీధిలోనూ వెల్లువెత్తిన పార్టీ శ్రేణుల ఉత్సాహం:

ప్రచార కార్యక్రమం పొడవునా వైఎస్సార్‌సీపీ శ్రేణుల కోలాహలం,జై జగన్ నినాదాలు మిన్నంటాయి.పార్టీ కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.ప్రతి వీధిలోనూ ప్రజల ఆత్మీయ పలకరింపులు,నాయకుల పట్ల వారు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే సర్పంచ్ అభ్యర్థి షేక్ సునీహ విజయం నల్లేరుపై నడకేనని స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఈ ప్రచార సభలు, పర్యటనలలో పోరుమామిళ్ల మండల,పట్టణ స్థాయి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు,అనుబంధ విభాగాల ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు అశేష అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.