13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా
రామాయంపేట, నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్)
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో 13 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, ఉపసర్పంచ్ బాబు నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

