📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి

నేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి

📰 Generate e-Paper Clip

*నేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి*

*ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కుమారస్వామి*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 20 (ప్రజావాణి): మంచాల గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ఉపాధి హామీ కూలీలకు, రైతులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా.. నేడు ఉదయం 9 గంటలకు మంచాల గ్రామపంచాయతీ కార్యాలయం పరిధిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించబడుతుంది.
ఈ గ్రామసభలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టిన పనులు, కూలీలకు కల్పించిన పనిదినాలు, కూలీలకు అందిన వేతనాలు, పనుల అమలు తీరు తదితర అంశాలపై చర్చించి, సామాజిక తనిఖీ నిర్వహించనున్నారు. పథకం అమలులో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించడం ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం.
కావున గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ గ్రామసభకు హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి గ్రామసభను విజయవంతం చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్ చేసారు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.