📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభారీ పైతాన్ కొండచిలువను కాపాడిన ఫారెస్ట్ అధికారులు

భారీ పైతాన్ కొండచిలువను కాపాడిన ఫారెస్ట్ అధికారులు

📰 Generate e-Paper Clip

భారీ పైతాన్ కొండచిలువను కాపాడిన ఫారెస్ట్ అధికారులు

నేరడ గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీ సూచన మేరకు స్పందించిన అధికారులు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా నేరడ రెవిన్యూలో కొండ చిలువ కలకలం రేపింది.రె ఒక రైతు పత్తి చేనులో ఈ రోజు పత్తి తీస్తున్న కూలీలకు భారీ పైతాన్ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన నేరడ రెవెన్యూ పరిధిలోని శ్రీ గంగమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.పత్తి చేనులో పని చేస్తున్న కూలీలకు భారీ కొండచిలువ కనిపించడంతో వారు భయంతో చేను నుంచి బయటకు వచ్చి గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి స్థానికుల సహాయంతో చేనులో నక్కి ఉన్న భారీ పైతాన్ కొండచిలువ 70 కేజీల బరువున్న వన్యప్రాణిని పట్టుకున్నారు.కొండచిలువ ఇటీవల ఏదైనా జంతువును ఆహారంగా తీసుకుని ఉండవచ్చని, విశ్రాంతి కోసం చేనులోకి వచ్చి ఉండవచ్చని అటవీ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.భారీ కొండచిలువను అటవీ సిబ్బంది సురక్షితంగా పట్టుకోవడంతో కూలీలతో పాటు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్ సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంకెన నాగేశ్వరావు గ్రామ ఉప సర్పంచ్ కోట బాలేష్ చెవుల తిరుపతిరావు గ్రామపంచాయతీ సిబ్బంది కనకపూడి శంకర్రావు గుజ్జర్ల శంకర్రావు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.