📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదళిత ఎంపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి

దళిత ఎంపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి

📰 Generate e-Paper Clip

దళిత ఎంపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి!

ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ కల్పించాలి.. గిరిజన మహిళా ప్రజాప్రతినిధుల సస్పెన్షన్ ఎత్తివేయాలి

పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తే సస్పెన్షన్లా? ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష తగదు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 21

దళిత, గిరిజన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడంతో పాటు, ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులపై సస్పెన్షన్ వేటు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా దళిత, గిరిజన వర్గాలకు చెందిన ప్రజలకు సమాన గౌరవం, రక్షణ కల్పించడంలో ఇంకా సమస్యలు ఎదురవుతుండటం ఆందోళనకరమని పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛగా ప్రజాసేవ చేసే అవకాశం ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వార్డు మెంబర్, ఉపసర్పంచ్‌లను సస్పెండ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం నేరమా? ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొనడం తప్పా? ముఖ్యంగా గిరిజన మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత సస్పెన్షన్ ఉత్తర్వులను పునఃపరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఒకవైపు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూనే మరోవైపు దళిత, గిరిజన ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేస్తున్నారు.

అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణకు అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రోటోకాల్ కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందించకపోవడం, కార్యక్రమాల ప్రచారంలో ఎంపీ పేరు, ఫొటోకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీకి తగిన గౌరవం కల్పించకపోవడం ఆయనను ఎన్నుకున్న ప్రజల తీర్పును విస్మరించడమేనని పేర్కొంటున్నారు.

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకులు ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో వివరించాలని, రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలకే పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే వాటికి ఆటంకాలు కల్పించడం సరికాదని విమర్శిస్తున్నారు.

వంశీకృష్ణ పదవుల కోసం కాకుండా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఆయన చేపట్టే కార్యక్రమాలకు సహకరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. వ్యక్తిగత రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

తక్షణమే సస్పెన్షన్లు ఎత్తివేయాలి

గిరిజన మహిళా ప్రజాప్రతినిధులపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేసి న్యాయం చేయాలని, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అన్ని అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రోటోకాల్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత, గిరిజన వర్గాలకు సమాన హక్కులు, సమాన గౌరవం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారం శాశ్వతం కాదని, ప్రజల ఆత్మగౌరవమే ముఖ్యమని పేర్కొంటూ దళిత, గిరిజనుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తామని స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.