కరీంనగర్,నవంబర్ 20 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వివేకానంద యూత్ సభ్యులు , మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరుగు రాము వివాహ వేడుకకు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, రిటైర్డ్ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి,వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అధ్యక్షులు గూడూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

