సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి విర్లపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేయాలి: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట రాజు మాదిగ
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20
మిర్యాలగూడ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విర్లపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సోహమ్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దామరచర్ల మండల అధ్యక్షులు కోట రాజు మాదిగ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కోట రాజు మాదిగ మాట్లాడుతూ విర్లపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ ద్వారా స్థానిక ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యంపై ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఆకాంక్షించారు.
కంపెనీ యాజమాన్యం స్థానిక యువతకు ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హత కలిగిన నిరుద్యోగులకు వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కేవలం పరిశ్రమ ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కూడా కంపెనీ భాగస్వామ్యం కావాలని సూచించారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల విర్లపాలెం గ్రామంతో పాటు దామరచర్ల మండలంలోని ఇతర గ్రామాల యువతకు కూడా ప్రయోజనం చేకూరేలా కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అనేది స్థానిక ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, ఆకాంక్షలను తెలియజేసేందుకు ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. పరిశ్రమ నిర్వాహకులు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
పరిశ్రమ ద్వారా స్థానిక ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ సమస్య తగ్గి యువతకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని కోట రాజు మాదిగ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


