*విద్యార్థులకు చదువుతో పాటు చట్టాలపై అవగాహనా ఉండాలి*
*మైనారిటీ పాఠశాలలో జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ ఖలీల్*
జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో మైనారిటీ బాలుర హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సును పిఅర్ఎల్ జూనియర్ సివిల్ జడ్జి sri. మొహమ్మద్ అబ్దుల్ ఖలీల్ నిర్వహించి విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించి చక్కగా చదువుకోవాలని, పెద్దలను తోటివారిని గౌరవించాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించిన వారు కఠిన శిక్షలకు లోనవుతారని తెలియ జేశారు. విద్యార్ధినులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఉపాధ్యాయులు మనకు దిశా నిర్దేశకులని, వారిని గౌరవించడం మన విధి అని తెలియజేసారు. ప్రతి విద్యార్ధి ఒక లక్షాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష సాధనకు ఉపాధ్యాయుల సహకారం తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో మోటార్ వాహనాల చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం విద్యార్థులకు తెలియజేసారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్, ఇస్మాయిలప్ప, సందీప్ కుమార్, విజయ్ కుమార్ , ప్రవీణ్ కుమార్ , ఫయీమ్, ప్రధానోపాధ్యాయులు మరియు లీగల్ సర్వీసెస్ సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

