📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణVB-GRAMG ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమం

VB-GRAMG ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*VB-GRAMG ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమం*

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం
చిల్లపల్లి గ్రామపంచాయతీలో VB-GRAMG పథకం కింద ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు ఈ రోజు పని ప్రదేశంలో వనభోజన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ గోపు సంతోష్ కుమార్ , ఉప సర్పంచ్ శ్రీమతి కంచు రాణి వార్డు సభ్యులు, VB-GRAMG సీనియర్ మేట్, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు (MPW సిబ్బంది) మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కూలీలతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. కూలీల మధ్య స్నేహభావం, ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించడంతో పాటు పని ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
గ్రామ అభివృద్ధి పనుల్లో ఉపాధి కూలీలు, గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. అందరూ కలిసి వనభోజన కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా గడిపారు.
ఈ కార్యక్రమం కూలీలు, సిబ్బందిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందిస్తూ ఆహ్లాదకరంగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.