📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

*మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం*

*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్*

* *మన ప్రజావాణి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

దేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ పేదల సంక్షేమానికి, మహిళా సాధికారతకు, దేశ సమగ్రత కోసం విశేష కృషి చేశారని, ఆమె దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కేంద్రమైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 డివిజన్ లో గురువారం మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి అని, ఆమె చూపిన ప్రజాసేవ మార్గమే తమకు ఆదర్శమని తెలిపారు. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి పలు రంగాలలో విశేష సేవలు అందించారని, ఆర్థిక, సామాజిక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు. 1969లో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయికరణ చేశారని, హరిత విప్లవం, ఆహార భద్రత లో భాగంగా అధిక దిగుబడినిచ్చే వంగడాలు, నీటిపారుదల, వ్యవసాయ రుణాలతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధి సాధించారని గుర్తు చేశారు. 1971లో 26వ రాజ్యాంగ సవరణలతో సంస్థానాధీశుల రాజభరణాలను రద్దు చేశారని, గరీబీ హఠావో నినాదంతో పేదల సంక్షేమానికి విశేష కృషి చేయడంతో పాటు సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య – మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణే ఇందిరాగాంధీకి నిజమైన నివాళి…డాక్టర్ నీలకంఠేశ్వరరావు*

*సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు*

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ సెల్ ఇంచార్జి డాక్టర్ ఎం నీలకంఠేశ్వర రావు తెలిపారు. గురువారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల పట్టణంలోని చార్వాక హాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలకంఠేశ్వర రావు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ దేశ ఐక్యత, సమగ్రత తోపాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. బ్యాంకుల జాతీయికరణ వంటి నిర్ణయాలతో సామాన్య ప్రజలకు ఆర్థిక సేవలు చేరువయ్యేలా కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, దేశాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సేవాదళ్ దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే సేవా కార్యక్రమాలు, త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటానికి కాంగ్రెస్ శ్రేణులు కట్టుబడి ఉండాలన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా, బీసీల హక్కుల సాధనకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు అరిగెల పద్మ, వనజా, పలిగిరి కనకరాజు, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.