భారతీయ జనతా పార్టీ మహబూబాద్ జిల్లా ఎండోమెంట్ (ధార్మిక సెల్) ముఖ్య సమావేశం
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 19: నర్సింహులపేట మండల కేంద్రంలో ఈరోజు భాజపా ఎండోమెంట్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ శ్రీ అన్నా వఝల సూర్యప్రకాష్, కో-కన్వినర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వినర్ ఈశ్వర ప్రగడ రామరావు గారి చేతుల మీదుగా మానుకోట జిల్లా లోని అన్ని మండలాలకు కమిటీ లను ఏర్పాటు చేసి వారికీ నియామక పత్రాలను అందచేసి వారికి దిశా నిర్దేశలను తెలియచేయటం జరిగినది. ఈ కార్యక్రమం లో
భాజపా మానుకోట జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు, భాజపా జిల్లా సెక్రటరీ నంద్యాల అశోక్,భాజపా ఎండోమెంట్ సెల్ మానుకోట జిల్లా కన్వినర్ నాగయ్య శాస్త్రి, కో-కన్వినర్ అలువాల శ్రీధర్, జాయింట్ కన్వినర్ గర్రెపల్లి నాగేష్, మండల అధ్యక్షులు సూరబోయిన సతీష్,భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగినది.

