📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

-ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

-VO భవనాలు, నూతన గ్రామపంచాయతీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 19

దామరచర్ల మండలంలో 150 నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ.
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ 109వ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రారంభించి, నూతన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు…
ఈ సందర్భంగా మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో, అడవిదేవులపల్లి మండలంలోని గోన్యా తండాలో, దామరచర్ల మండలంలోని కొండ్రపోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సంఘాల VO భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు…
ఈ భవనాలు గ్రామీణ ప్రజలకు, మహిళా సంఘాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, గ్రామస్థాయి పరిపాలన మరింత సులభతరం కావడంతో పాటు మహిళా సంఘాల కార్యకలాపాలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు…
అనంతరం దామరచర్ల మండల కేంద్రంలో *150 నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి* పనులను ప్రారంభించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు…
ఈ కార్యక్రమాల అనంతరం ఆయా గ్రామాల్లో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు…
ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా MLA -BLR మాట్లాడుతూ..
స్వర్గీయ ఇందిరా గాంధీ దేశ సమగ్రత, సమైక్యత, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలని కొనియాడారు.
మహిళా సాధికారతకు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు
ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా సంఘాల బలోపేతం, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే BLR హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.