📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహా మాయగాడు కాలిషా వలి

స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహా మాయగాడు కాలిషా వలి

📰 Generate e-Paper Clip

స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహా మాయగాడు
కాలిషా వలి

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 18

కాలిషా వలి మహిళలను నిలువు దోపిడీ..- జర్నలిస్టు ముసుగులో వివాహితకు టోకరా – మహిళను నమ్మించి బంగారం, డబ్బు కాజేసిన ఘనుడు
– ప్రోర్జరీ సంతకాలతో కెనరా బ్యాంకులో
రూ 1,50,000లు అడ్డదారిలో రుణం
– ఒంగోలులో రోడ్డున పడ్డ సత్యనారాయణపురం మహిళ అరుణ
– నిలదీసిన జర్నలిస్ట్ లీడర్ను అంటూ బాధిత దంపతులపై బెదిరింపులు
– తాలూకా పొలీసు స్టేషన్లో కాలిషాపై ఫిర్యాదు
– దొంగ జర్నలిస్టును అరెస్టు చేసి న్యాయం చేయాలని బాధిత దంపతులు విజ్ఞప్తి
–
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన దృష్టికి తీసుకుని వెళ్ళిన బాధ్యతలు..

పోలీసు అధికారులతో విచారించి తగిన న్యాయం చేస్తానని బాధ్యతలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.

ఒంగోలులో కర్నింగ్ జర్నలిస్ట్ ‘కాలీషా వలి’ భాగోతం బట్టబయలైయ్యింది. జర్నలిస్టు ముసుగులో ఓ వివాహితను నమ్మించి నట్టేట ముంచాడు. మాయ మాటలతో ఆమె వద్ద ఉన్న బంగారం, నగదును లూటీ చేసి చేతులెత్తేశాడు. ముద్ర రుణం ఇప్పిస్తానంటూ
ఆ అమాయక దంపతుల వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి ప్రొర్జరీ సంతకాలతో కెనడా బ్యాంకులో రూ లక్షా 50 వేలు రుణం తీసుకొన్ని వారికి టోకరా పెట్టాడు. జర్నలిస్ట్ యూనియన్ లీడర్ను అంటూ బడాయి మాటలు చెబుతూ వారి వద్ద నుండి బంగారంతో పాటు నగదు కాజేసిన తీరు అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మోసపోయామని గ్రహించిన ఆ అమాయక దంపతులు
జర్నలిస్ట్ ని నిలదీయడంలో బంగారం, డబ్బు ఇవ్వను, మీకు చేతనైది చేసుకో, నేను జర్నలిస్ట్ యూనియన్ లీడర్ను నన్నేమి చేయలేరంటూ వారిపై దుర్భాషలాడుతూ వాదనకు దిగాడు. దీంతో మాయ జర్నలిస్ట్ కాలిషా పై తాలూకా స్టేషన్లో బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. మోసం చేసిన కాలిషా వలి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు సారాంశాన్ని పరిశీలిస్తే….
కేతా అరుణ, కేతా నాగ రమేష్ అను మేము ఇద్దరం భార్యభర్తలము. మేము సత్యనారాయణపురం శ్రీరామ్ హాస్పిటల్ ఎదుట నివాసం ఉంటున్నాము. మేము టైలరింగ్ వృతి చేసికొని జీవనం కొనసాగిస్తున్నాం. మాకు సత్యనారాయణ పురం శ్రీరామ్ హాస్పిటల్ ఎదుట సొంత ఇల్లు ఉన్నది. రోడ్డు ఫేస్లో ఉన్న మా ఇంట్లో చిన్న రూము కూడా ఉన్నది. అది రూ 5 వేల రూపాయలకు బాడుగకు వస్తుంది. అంతకు ముందు ఉన్నవాళ్ళు ఖాళీ చేయడంతో
ఆ రూము నాకు అద్దెకు ఇస్తే ఆ రూములో మీసేవా కేంద్రం పెట్టుకుంటానని షేక్ కాలేషా వలీ మమ్మల్ని నమ్మించాడు. దీంతో రూమును అతనికి అద్దెకు ఇచ్చాము. అతను మీసేవా కేంద్రం పెట్టుకున్నాడు. 2, 3 నెలలు గడిచిన తర్వాత మాతో అతనికి సత్సంబంధం ఏర్పడటం వలన మేము అతనిని బాగా నమ్మినాము.
ఆ తరువాత మీసేవా కేంద్రం డెవలప్ చేయాలి అని మమ్ములను డబ్బులు అడిగినాడు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినాము. అందుకు కాలిషా వలి డబ్బులు ఇవ్వనవసరం లేదు, మీ పేరు మీద ముద్రా లోన్ తీసుకుంటాను, మీరు వచ్చి బ్యాంక్లో సంతకం పెట్టండి అని అన్నాడు. ఆ లోను మీ పేరుమీద తీసుకోండి అని మేము అంటే, నేను స్మాల్ మీడియా అస్సోసియేషన్ జిల్లా అధ్యకుడను, నా పేరు మీద బ్యాంక్ వాళ్ళు లోను ఇవ్వరు అన్నాడు.
మేము అతనిని నమ్మి 60 అడుగుల రోడ్డులో గల కెనడా’ బ్యాంకులో మా పేరుమీద ముద్రా లోను రూ 50 వేలు ఇప్పించినాము. నెలనెలా కిస్తీలు కట్టమని చెప్పేవాము. సరే అన్నాడు. మరలా ఆ తరువాత నాకు శ్రీకారం న్యూన్ డైలీ పత్రికకు గవర్నమెంట్ నుండి నాకు పేపర్ టైటిల్ అనుమతి వచ్చింది. ఆ పేపర్ డెవలప్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి, మీరు పెట్టుబడికి డబ్బులు ఇవ్వమని అడిగినాడు. మా కాడా అంతడబ్బులు లేవు అన్నాము. మీ దగ్గర బంగారం ఉంది కదా, అది బ్యాంక్లో పెడితే డబ్బులు వస్తాయి, నేను పీపర్ డెవలప్ చేసి వడ్డీ, అసలు ఇస్తాను అని చెప్పి మా దగ్గర ఉన్న 3 సవర్ల బంగారం. దండ, 2 జతల కమ్మలు, 3 జతల కాళ్ళ పట్టీలు తీసుకొని వెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్ పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మరలా 2 నెలల తరువాత డబ్బులు చాలలేదు మరికొంత పైకం అవసరం అయింది అని మమ్మల్ని అడిగితే మరో 60 వేలు తెలిసినావల్ల దగ్గర తీసుకొని క్యాష్ ఇచ్చాము. ఆ తరువాత కెనడా బ్యాంకు మొయిన్ బ్రాంచ్ నుండి మాకు ఫోన్ వచ్చింది. మీరు సరిగా కిస్తీలు కట్టడం లేదు, వెంటనే బ్యాంక్ దగ్గరకు రమ్మన్నారు. మేము బ్యాంక్ దగ్గరకు వెళ్ళము, బ్యాంక్ అధికారులు మీరు రూ 1,50,000 డబ్బులు తీసుకున్నారు. ఎందుకు డబ్బులు కట్టడం లేదు అన్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. అసలు మీ బ్యాంక్ లో మేము లోను తీసుకోలేదు. మేము 60 అడుగుల రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకు రూ 50 వేలు ముద్రా లోను తీసుకొని కాలేషా వలికి ఇప్పించినాము. మీ బ్యాంక్ ఇప్పించ లేదు అని బ్యాంక్ వాళ్ళతో అన్నాము. లేదు జర్నలిస్ట్ కాలేషా వలీ 1,50,000లు లోను తీసుకున్నారు అని కాగితాలు చూపించినారు బ్యాంక్ వాళ్ళు, మాకు అప్పుడు అర్థం అయినది, మా సంతకాలు ప్రోర్జరీ చేసి లోను తీసుకున్నాడు.
అప్పుడు మాకు భయం వేసి మా బంగారం, వెండి, మేము ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని అడిగినాము. నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానని కేర్ లెన్గా సమదనం చెప్పినాడు. మీరు ఈ విషయం బయటకు ఎక్కడైనా చెబితే మీ అంతు తెలుస్తాను అని బెదిరించినాడు. ఈ విషయం మా కుటుంబ సభ్యుల దగ్గర చర్చించి అతనిని పిలిపించినాము. అక్కడ నేను జర్నలిస్ట్ లీడరును నన్ను ఎవరు ఏమి చేయలేరు, మీకు దిక్కు ఉన్నచోటికి పోయి చెప్పుకో, నాకు భయం లేదు, నా వెనుక చాలామంది జర్నలిస్ట్లు ఉన్నారు. నాకు వారి అండ కూడా ఉన్నది, మీరు ఎక్కువ మాట్లాడితే, మీ క్యారెక్టర్ బ్యాడ్ చేసి పేపర్లో వేయిస్తా జాగ్రత అని బెదిరించినాడు జర్నలిస్ట్ షేక్. కాలేషా వలి, ఇతను జర్నలిస్ట్ లీడర్ కాబట్టి మేము ఎవరికి చెప్పుకోలేక పోయినాము. ఇక మా కుటుంబ సభ్యులు అందరూ పొలీసు స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయమని చెప్పడంతో నేను ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. స్మాల్, మీడియా అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ కాలేషా వలి మీద తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.