📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలి

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలి

📰 Generate e-Paper Clip

*ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలి*

*హోతి బి గ్రామంలో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణిలో సర్పంచ్ మచ్చేందర్*

జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమే పని చెయ్యాలని, గతంలో అధికారంలో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమలు అమలు చేశాయని సర్పంచ్ దాసరి మచ్చెందర్ అన్నారు. బుధవారం జహిరాబాద్ మండలంలోని హోతి బి గ్రామంలో సర్పంచ్ మచ్చేందర్ ఆధ్వర్యంలో వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో గత ప్రభుత్వం వితంతు, వృద్దులకు, ఒంటరి మహిళలకు 2016, వికలాంగులకు 4016 పింఛన్ అందించిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్దులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4016, వికలాంగులకు 6000 లకు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికలు అయి మూడేళ్లు కావస్తున్న ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఫర్వేజ్, ఉప సర్పంచ్ విష్ణు, వార్డు సభ్యులు జియా, రాజు, రాసప్ప, చింటు, మల్లన్న, మోసిన్, మామూద్ సాబ్, బంటి, అడ్డు తదితర బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.