📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎమ్మెల్యే అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి నిధులకు హామీ ఇచ్చిన మంత్రి

ఎమ్మెల్యే అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి నిధులకు హామీ ఇచ్చిన మంత్రి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి నిధులకు హామీ ఇచ్చిన మంత్రి

నవంబర్ 19 ప్రజావాణి న్యూస్/సంగెం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంపీ కావ్య, కలెక్టర్ సత్యశారద మంత్రి సీతక్క

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కరూ.40.95కోట్లతో
హ్యామ్ రోడ్లు, చేయూత పింఛన్లు, పాలశీతలీకరణ కేంద్రం భవనానికి శంకుస్థాపన

సంగెం: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ది కోటీశ్వరులను చేసి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం సంగెం, గీసు కొండ మండలాల పరిధిలోని టెక్స్టైల్ పార్కు లో జరిగిన సమావేశంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే ప్రకాశెడ్డిలతో కలిసి పరకాల నియోజకవర్గం లో రూ 40.95 కోట్ల నిధులతో చేపట్టిన హ్యామ్ రోడ్లు, ఇందిరా మహిళా డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం భవనం, మండల పరిషత్ కార్యాలయా లకు శంకుస్థాపన, చేయూత పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి,
మహిళల ఆర్థిక స్వావలంబనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయగా అందులో 3.50 లక్షల మంది మహిళలే ఉన్నారన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఎస్ఐర్ పేరుతో దేశంలో 90 లక్షల ఓట్లను బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ఎంపీ కడియ కావ్య అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరా మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామ న్నారు. ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.32 కోట్లు కేటాయించడంతో పాటుగా 10 ఎకరాల భూమిని కేటాయించిందని మొత్తం రూ.52 కోట్ల ఆస్తికి మహిళలే యాజమానులన్నారు. ఈ కార్య క్రమంలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ వైవీ గణేష్, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంత, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, తహసీల్దార్ రాజ్కుమార్, రియాజోద్దిన్, ఎంపీడీ ఓలు రవీందర్, శ్రీధర్, మండల సమాఖ్య అధ్య క్షురాలు ఉమాదేవి, సోసైటీ చైర్పర్సన్ విజయ, మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్, దాడి శివ మండలంలో ఉన్న గ్రామ సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు ప్రజాప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.