నేడు ఇందిరా కుటుంబ బీమా పై అవగాహన:తహసిల్దార్
ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేటి(గురువారం ఈ నెల 19)నుంచి అమలు చేయనున్న ఇందిర కుటుంబ జీవిత బీమా పథకం పై నేడు మండల కేంద్రం ఇనుగుర్తి లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,జిపిఓల తో పాటు సంబంధిత అధికారులకు ఇందిర కుటుంబ జీవిత బీమాపై అవగాహన సమావేశం ఉ.10 గం. నుంచి జరుగుతుందని సకాలంలో హాజరు కావాలని కోరారు.
*20 నుంచి దరఖాస్తులు..*
ఇందిరా కుటుంబ బీమా పథకానికి రేపటి(ఈ నెల 20)నుంచి ఆయా గ్రామపంచాయతీలలో దరఖాస్తులు సంబంధిత అధికారులు తీసుకుంటారని తహసిల్దార్ తెలిపారు. కుటుంబ బీమాకు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు ఈ పథకంలో కుటుంబంలో వ్యక్తి ఏ కారణం చేతనైనా మృతిచిందితే రూ.5 లక్షలు బీమా డబ్బులు సంబంధిత కుటుంబాని అందుతాయని పేర్కొన్నారు. 18 సం.లు నిండి 59 సం.ల లోపు వయసు గల కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా ఈ పథకానికి ఎంపిక చేసుకోవచ్చని సూచించారు.

