ఫోటోగ్రాఫర్ సోమన్న కూతురు, అల్లుడిని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ ఫోటోగ్రాఫర్ గుమ్మడవెల్లి సోమన్న – రాజకుమారి దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య వివాహం ఇటీవల ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ప్రత్యేకంగా సోమన్న నివాసానికి విచ్చేశారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు సౌమ్య, అనిల్ కుమార్ లను ఆశీర్వదించిన మాజీ మంత్రి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని, పెద్దలను గౌరవిస్తూ ఆదర్శ దంపతులుగా నిలవాలని సూచించారు.
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు సోమన్న కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రికి గుమ్మడవెల్లి సోమన్న కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఎలా సుందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, ఫాక్స్ వైస్ చైర్మన్ నక్క రమేష్, కామారెడ్డి గూడెం సర్పంచ్ చింత రవి, సుడిగేల హనుమంతు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

