📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి.

నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి.

📰 Generate e-Paper Clip

నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి.

రేషన్‌ షాపుల ద్వారా 12 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి

తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

రోజురోజుకు పెరుగుతున్న బియ్యం పప్పులు కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన వరి ధాన్యానికి తగిన ధర పెరగకపోగా మార్కెట్‌లో బియ్యం ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్‌ షాపుల ద్వారా గోధుమలు నూనె చక్కెర ఉప్పు పప్పులు సబ్బులు తదితర 12 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రోజున ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊటుకూరి రాములు, కర్రె లక్ష్మణ్ ,గోపాల్ పూర్ సర్పంచ్ కర్రె లక్ష్మి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాసు సీపీఐ మండల సహాయ కార్యదర్శి మర్రి విజయ్ డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టెముక్కుల మనోహర్‌రావు సీపీఐ నాయకులు సూర మొగిలి ఎం.మల్లయ్య జూపాక రవీందర్ ఊటుకూరి బిక్షపతి బోయినపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.