మాతుపల్లిలో పవర్ ట్రాక్ ఉచిత సర్వీస్ క్యాంప్
సిద్ధిపేట కపీశ్వర షోరూమ్ డీలర్స్ సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,
మద్దూరు(కొండపాక )నవంబర్18, ప్రజా వాణి,
మండలంలోని మతూపల్లి గ్రామంలో సిద్ధిపేట కపీశ్వర పవర్ ట్రాక్ షోరూమ్ ఆధ్వర్యంలో ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించినట్లు షోరూమ్ డీలర్స్ సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మతూపల్లి గ్రామ ట్రాక్టర్ల యజమానులతో పాటు కొండపాక మండల పరిసర ప్రాంతాల 50మంది ట్రాక్టర్ల యజమానులు క్యాంప్ లో చిన్న చిన్న మర్మత్తులు, గేర్ ఆయిల్, గ్రీసింగ్ లాంటివి చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి నెలకు ఒక సారి మీరుదొడ్డి, రాయపోల్,చిన్నకోడూరు, దౌలతాబాద్, దుబ్బాక, తోగుట మండలాల్లో ఉచిత సర్వీస్ క్యాంప్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత సర్వీస్ క్యాంప్ లను ట్రాక్టర్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్కార్ట్ కంపెనీ సెల్స్ ఏ బి ఎం రాంప్రసాద్, ఈ టి ఎం ఓ రాకేష్, సర్వీస్ ఏ ఎస్ ఎం అరుణ్, సర్వీస్ సూపర్వైజర్ మహేశ్, శ్రావణ్, మెకానిక్ బృందం నరేష్,అనిల్, శేఖర్, నూతన్, సాయికుమార్, కొండపాక సెల్స్ ఎక్జిక్యూటివ్ మధు తదితరులు పాల్గొన్నారు.

