📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన

బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన

📰 Generate e-Paper Clip

దండేపల్లి, నవంబర్ 18 (ప్రజావాణి): బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మతపరమైన ప్రదేశాలు, వివాహ సేవా ప్రదాతల భాగస్వామ్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సెక్టార్ పరిధిలోని పాత మామిడిపల్లి గ్రామంలో ఇరికిల్ల తేజ రవి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా 16 మంది బాలలకు పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నవంబర్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, క్యాటరర్లు, టెంట్ హౌస్ నిర్వాహకులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటి నివారణకు సహకరించాలని కోరుతున్నారు. మత పెద్దల ద్వారా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయించడం, వివాహ సేవా ప్రదాతలతో ప్రతిజ్ఞలు చేయించడం, ప్రచార సామగ్రి ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, బాలల భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు, గ్రామస్తులు, వివాహ సేవా ప్రదాతలు సహకరించాలని కార్యక్రమంలో కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.