📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేలేరులో పింఛన్ల పండుగ.. 81 మందికి నూతన ఆసరా పింఛన్లు

వేలేరులో పింఛన్ల పండుగ.. 81 మందికి నూతన ఆసరా పింఛన్లు

📰 Generate e-Paper Clip

**వేలేరులో పింఛన్ల పండుగ.. 81 మందికి నూతన ఆసరా పింఛన్లు!**

వేలేరు, నవంబర్ 18:
హామీని నిలబెట్టుకుంటూ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. పేదలకు పింఛన్లు ఎంతో ఆర్థిక అండగా నిలుస్తాయని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. మరో 20 పింఛన్లు పరిశీలనలో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమానికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సర్పంచ్‌తో పాటు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి విజయ, సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వార్డు సభ్యులు ప్రశాంత్, పర్వీన్, లక్ష్మీనారాయణ, చైతన్య, సురేష్, సునీల్, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.