*పోటీ ప్రపంచంలో నిర్దిష్ట లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలి*
*విద్యార్థులు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి*
*ఆచార్య యువ తరంగ్ లో పట్టణ సీఐ రాజబోయిన రవి*
*అంబరాన్నంటిన ఆచార్య యువ తరంగ్. 2026 ఉత్సవాలు*
జహీరాబాద్, నవంబర్ 17 (ప్రజావాణి): విద్యార్థులు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగితే జీవితంలో విజయం సాధించడం చాలా సులభం అని పట్టణ సీఐ అర్ రవి అన్నారు. మంగళవారం ఆచార్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక షెట్కర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన యువతరంగ్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రాజబోయిన రవి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలని యువత ముందుకు తీసుకెళ్లాలని, చెడు వ్యసనాలను బానిస కాకుండా కాంపిటేటివ్ రంగంలో ముందుండి పోటీ పరీక్షలకు హాజరై గొప్ప గొప్ప ఉద్యోగాలు పొంది తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన జానపద పాటల గాయని బట్టు శైలజ తన ఆటపాటల ద్వారా యువతను ఉర్రూతలూగించారు. అదేవిధంగా విద్యా ద్వారా గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కాబట్టి ప్రతి వ్యక్తి తన క్యారెక్టర్ ను కాపాడుకుంటూ సమాజంలో గొప్ప పౌరునిగా ఎదగాలని పేర్కొన్నారు. చిరాగ్ పల్లి ఎస్సై వినయ్ కుమార్ మరియు టౌన్ ఎస్ఐ పుష్పలత రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్ హరికుమార్, డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ షేట్కార్, మాధవి పాల్గొని తమ ఉపన్యాసాల ద్వారా యువతను చైతన్యవంతులు చేశారు. కార్యక్రమనికి హాజరైన ముఖ్య అతిధులకు కళాశాల యాజమాన్య బృందం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం వెంకటేశం, మదన్మోహన్, నందు గౌడ్, నర్సింలు, దత్తు, రమేష్, నికిత, నవీన, దీపిక, శిరీష, ఆయేషా, జగదేవి, శ్వేతా, నవనీత, సల్మా ఆఫ్షియా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

