📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనీరు, విద్యుత్తు వినియోగం అవసరం మేరకు ఉండేలా చూడాలి

నీరు, విద్యుత్తు వినియోగం అవసరం మేరకు ఉండేలా చూడాలి

📰 Generate e-Paper Clip

*నీరు, విద్యుత్తు వినియోగం అవసరం మేరకు ఉండేలా చూడాలి*

*ఎల్నీనో తుఫాను ను అందరి సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి*

*మండల సర్వ సభ్య సమావేశంలో మండల ప్రత్యేక అధికారి పూర్ణిమ*

జహీరాబాద్, నవంబర్ 17 (ప్రజావాణి): తాగునీరు, కరెంట్ వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని జహీరాబాద్ మండల ప్రత్యేక అధికారి పూర్ణిమ, ఎంపీడీవో వెంకట్ రెడ్డి సర్పంచులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ఎంపీపీ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్నీనో ప్రభావం వల్ల సక్రమంగా వర్షాలు కురువనందున ముందు ముందు నీటి ఎద్దడి రావచ్చని వారు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నీరు, కరెంట్ పొదుపుగా వాడుకొనే విధంగా సర్పంచులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో నీటి పైపులు, కుళాయిల లీకేజీలను అరికట్టి నీరు వృధా పోకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామాల సర్పంచులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. హోతి బి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం బియ్యంలో పురుగులు వస్తున్నాయని ఆ గ్రామ సర్పంచ్
మచేందర్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ఎంఈఓ మణయ్య మాట్లాడుతూ బియ్యంలో పురుగులు రాకుండా చూస్తామని, జరిగిన తప్పుపై చింతిస్తూ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని అన్నారు. సత్వర్ గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తమ గ్రామంలో విద్యా శాఖ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు తమకు తెలపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శేఖపూర్ తండా సర్పంచ్ కేతావత్ మోహన్ రాథోడ్ శేఖపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 291 లో అటవీ శాఖ భూమి ఉందా లేదా అని ప్రశ్నించగా అధికారి దుర్గ భవాని మాట్లాడుతూ శేఖపూర్ గ్రామంలో అటవీ భూమి లేదని అన్నారు. అదే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పార్కుల అభివృద్ధి కొనసాగుతుందన్నారు. రూరల్ ఎలక్ట్రికల్ ఏఈ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సమస్యలు లేకుండా మూడంచెల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, మోహన్ రాథోడ్, రాజ్ కుమార్, నరేష్, చందర్, సత్వార్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.