📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎమ్మెల్యే సహకారంతో బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు

ఎమ్మెల్యే సహకారంతో బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు

📰 Generate e-Paper Clip

*ఎమ్మెల్యే సహకారంతో బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు*

*– రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.25 లక్షలతో అతిథి గృహ నిర్మాణం*

*– బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: దేవాలయ కమిటీ సభ్యుడు అనంగల్ల యాదయ్య*

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 17 (ప్రజావాణి):

మంచాల మండలం ఆరుట్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో మొత్తం రూ.45 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, రూ.25 లక్షల వ్యయంతో దేవాలయం వద్ద అతిథి గృహాన్ని నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఆరుట్ల గ్రామంలో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు దేవాలయం వద్ద జరుగుతున్న అతిథి గృహ నిర్మాణ పనులను దేవాలయ కమిటీ సభ్యుడు, ఆరుట్ల మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యుడు అనంగల్ల యాదయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు మహమ్మద్ ఇమ్రాన్, దేవాలయ కమిటీ సభ్యులు వెదిరే రమణారెడ్డి, మానిపాటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.