*దాద్పల్లి గ్రామానికి 16 నూతన ఆసరా పింఛన్లు మంజూరు*
*లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
*అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం*
*కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్ వెంకటరమణ గౌడ్, పాలకుర్ల శేఖర్ గౌడ్*
మంచాల, నవంబర్ 17 (ప్రజావాణి): మంచాల మండలంలోని దాద్పల్లి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా 16 ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్ వెంకటరమణ గౌడ్, పాలకుర్ల శేఖర్ గౌడ్, సీనియర్ నాయకుడు జాటోత్ రాజు నాయక్ కలిసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో దాద్పల్లి గ్రామానికి 16 నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని తెలిపారు. పింఛన్లు మంజూరు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే తమ లక్ష్యమని నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు హీరా నాయక్, నాయకులు సిద్ధగోని దేవేందర్ గౌడ్, రాజేందర్, రవి, నూతన పింఛన్

